మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ స్పెషల్ గా ఓ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. మొదటినుండీ కాస్త విభిన్నమైన సినిమాలు చేసుకంటూ అలానే మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాయి. అయితే గత ఏడాది వచ్చిన గని సినిమా అలానే ఎఫ్3 సినిమా కాస్త నిరాశను మిగిల్చాయి. ఇక ఇప్పుడు గాండీవధారి అర్జున అనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేయగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అర్జున్ అనే ఆఫీసర్ గా వరుణ్ తేజ్ నటిస్తుండగా.. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. అంతేకాదు ట్రైలర్ చివరిలో భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్ మనిషేనేమో అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. చూడబోతే ఈసినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: