రివ్యూ : జైలర్

jailer telugu movie review

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.ఈ సినిమా రజినీ పవర్ ఏంటో చూపెట్టింది.అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొట్టింది.ట్రైలర్,సాంగ్స్ సూపర్ గా ఉండడం తో ఒక్కసారిగా సినిమాకు భారీ హైప్ వచ్చింది. తెలుగు లోకూడా డీసెంట్ బిజినెస్ చేసింది.మరి ఈ రోజు థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథ :
ముత్తు ( రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. ఫ్యామిలీ,ఫ్రెండ్స్ తో కలిసి సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తువుంటాడు.ముత్తు కొడుకు అర్జున్ (వసంత్ రవి) పోలీస్ ఆఫీసర్. మాఫియా గ్యాంగ్ లీడర్ అయిన వర్మ (వినాయకన్) తో అర్జున్ ఎదురెల్తాడు.దాంతో వర్మ అర్జున్ ను హత్య చేస్తాడు.ఈక్రమంలో ముత్తు తన కొడుకు హత్య కు కారణమైన వాడిఫై పగ తీర్చుకోవాలనుకుంటాడు.ఇంతకీ ముత్తు కొడుకును ఎందుకు చంపారు.దానికి ముత్తు రివేంజ్ తీర్చుకున్నాడా లేదా లేదా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

శివాజీ తరువాత రజినీకాంత్ నుండి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ రాలేదు. ఆ లోటును ఈ జైలర్ తీర్చింది.కథ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కానీ  ప్రతి సీన్ ను బాగా హ్యాండిల్ చేశాడు. రజినీ ప్రెజెంటేషన్  సినిమాలో హైలైట్. డార్క్ కామెడీ ని తీయడంలో నెల్సన్ సిద్ద హస్తుడు. అదే  మ్యాజిక్ ఈ సినిమాలోనూ వర్క్ అవుట్ అయ్యింది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రజినీకాంత్ ,యోగి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా వున్నాయి.దానికి తోడు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, ఇంటర్వల్ బ్లాక్ సెకండ్ హాఫ్ ఫై అంచనాలను పెంచేసాయి.

ఇక సెకండ్ హాఫ్ ను అదే హై తో స్టార్ట్ చేశాడు డైరెక్టర్ కానీ మధ్యలో నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే మళ్ళీ క్లైమాక్స్ లో తన పట్టు చూపించాడు డైరెక్టర్.సినిమా ను పర్ఫెక్ గా ఎండ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది కానీ సినిమా మాత్రం నచ్చుతుంది అనడం లో అనుమానం లేదు.దీనికి తోడు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్  సినిమాకు మరో ప్రత్యేకత. అలాగే స్టార్స్ యాక్టర్స్ …మోహన్ లాల్,శివ రాజ్ కుమార్,జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించి  సప్రైజ్ చేశారు.

నటీనటుల విషయాన్ని వస్తే సినిమాలో రజినీ వన్ మ్యాన్ షో చేశాడు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకున్నారో ఈసినిమాలో అలాగే కనిపించారు.యాక్టింగ్ ,లుక్ పరంగా అదరగొట్టారు.అలాగే కమెడియన్ యోగి బాబుకు మరో మంచి రోల్ పడింది.సినిమాలో రజినీకి ఆయనకు మధ్య సన్నివేశాలు బాగా పేలాయి.తమన్నా,సునీల్,రమ్యకృష్ణ,వసంత్ రవి కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.

టెక్నికల్ పరంగా చూస్తే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కథను డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా రజినీకాంత్ ను స్క్రీన్ మీద చూపెట్టిన విధానం చాలా బాగుంది.ఇక అనిరుద్ ఈసినిమా కు మరో హీరో అని చెప్పొచ్చు.గత కొంత కాలంగా ఫుల్ ఫామ్ లోవున్న అనిరుద్ ఈ సినిమా తోను సత్తా చాటాడు.సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.నిర్మల్ ఎడిటింగ్  షార్ప్ గా వుంది. విజయ్ కణ్ణన్ సినిమాటోగ్రోఫీ  బాగుంది.సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

ఓవరాల్ గా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన జైలర్ లో రజినీకాంత్ నటన ,అనిరుద్ మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్ లో  వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యియి.రజినీకాంత్  అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మిగితావారికి డీసెంట్  అనిపిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =