డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ రాసే సాలిడ్ డైలాగ్స్ ను మహేష్ బాబు ఇంటెన్స్ తో కూల్ గా చెప్తే ఆ డెప్త్ ఎలా ఉంటుందో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అది అలా ఉంచితే బిజినెస్ మేన్ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 9వ తేదీన మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. ఈసినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ చేయగా.. ఓపెన్ చేసిన కొద్ది నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 4కే వెర్షన్ లో రిలీజ్ చేసిన ఈసినిమా ట్రైలర్ కు అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: