విజయ్ దేవరకొండ,సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ అయ్యాయి.మొదటి పాట నా రోజా నువ్వే అయితే అన్ని భాషల్లో కలిపి 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.సెకండ్ సాంగ్ ఆరాధ్య కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ఇక ఇప్పుడు మూడో సాంగ్ గా ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రెండు పాటలను మించి ఈ సాంగ్ వుంది.దాంతో ఈసాంగ్ కూడా చార్ట్ బాస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అనురాగ్ కులకర్ణి పాడగా ఈసినిమా డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించాడు.ఈ మూడు పాటలు కూడా ఆయనే రాయడం విశేషం.విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ గా ఉండడంతో ఆడియో తోనే సినిమాకు చాలా హైప్ వస్తుంది.మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకు ఇచ్చిన మ్యూజిక్ బాగుండడంతో తెలుగులో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా భారీ ఆఫర్ ను కొట్టేశాడని టాక్. ఖుషిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీ గా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: