నటీనటులు : ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్
ఎడిటింగ్ :విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫీ :బాల్ రెడ్డి
సంగీతం :విజయ్ బుల్గానిన్
దర్శకత్వం :సాయి రాజేష్
నిర్మాత : ఎస్ కె ఎన్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాంగ్స్,ట్రైలర్ తో హైప్ తెచ్చుకుంది బేబి సినిమా.ఆనంద్ దేవరకొండ,అశ్విన్ విరాజ్,వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను కలర్ ఫోటో రైటర్,నిర్మాత సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు.ఇక ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
వైష్ణవి,ఆనంద్,విరాజ్ ఈమూడు పాత్రల చుట్టూ తిరిగి కథే బేబీ సినిమా.ఒకరకంగా చెప్పాలంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ.బస్తీలో వుండే వైష్ణవి(వైష్ణవి చైతన్య) తన ఇంటికి ఎదురరుగా వుండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో ప్రేమలో పడుతుంది.అయితే 10వ తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో నడుపుకుంటూ స్థిరపడతాడు.వైష్ణవి ఫై చదువులు కొనసాగిస్తూ బీటెక్ కోసం కాలేజ్ లో జాయిన్ అవుతుంది.అక్కడ విరాజ్( విరాజ్ అశ్విన్ )వైష్ణవి కి దగ్గర అవుతాడు ఓ రోజు పబ్ లో వైష్ణవి,విరాజ్ రొమాన్స్ చేయగా ఆ విషయం ఆనంద్ కు తెలుస్తుంది ఆ తరువాత ఏమైంది.విరాజ్ కి ఆనంద్,వైష్ణవి లవ్ స్టోరీ గురించి తెలుస్తుందా? చివరికి వైష్ణవి ఎవరికి దక్కుతుంది అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
యూత్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది.స్కూల్,కాలేజ్ సమయాల్లో ఇలాంటి లవ్ స్టోరీ లు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. దాన్ని అంతే సహజంగా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు సాయి రాజేష్.ముఖ్యంగా కొన్ని డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడతాయి.మొదటి భాగం స్కూల్ లో లవ్ స్టోరీ ఆ క్రమంలో ఆనంద్ ,వైష్ణవి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.దానికి తోడు పాటలు కూడా కథ లో భాగంగానే రావడంతో ఎక్కడా బోర్ కొట్టదు.ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు పీక్స్ లో ఉంటుంది. అక్కడి నుండి ద్వితీయార్థం లో ఏం జరుగుతుందో అని ఆసక్తి మొదలవుతుంది.సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా నిరాశపరచదు. దాదాపు అంతా సీరియస్ గానే సాగుతుంది.క్లైమ్యాక్స్ కూడా సంతృప్తినిస్తుంది కానీ ఒక్క రన్ టైం ఇంకొంచెం తక్కువగా ఉంటే బాగుండు అన్న ఫీల్ తెప్పిస్తుంది అంతే తప్ప సినిమాకి పెద్దగా కంప్లైన్ట్స్ కూడా ఏం లేవు.
నటీనటుల విషయానికి వస్తే కాస్టింగ్ సినిమాకు చక్కగా సరిపోయారు.ఆనంద్ పాత్రలో ఆనంద్ దేవరకొండ సహాజంగా నటించాడు.తన కెరీర్ లో ఇదే బెస్ట్ రోల్.స్కూల్ లో కంటే ఆటో డ్రైవర్ గా చాలా బాగా నటించాడు.ఇక సినిమా కు హైలైట్ అయ్యింది వైష్ణవి పాత్ర.వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య బేబి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇది తనకి పర్ఫెక్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు.లుక్స్ పరంగా వేరియషన్ చూపించడచడమే కాదు నటన కూడా ఆకట్టుకుంటుంది.అలాగే నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో విరాజ్ అశ్విన్ మెప్పించాడు.తనకి మంచి పాత్ర దొరికింది.మిగితా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఇక కాస్టింగ్ కి తోడు టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా సినిమాకు చాలా సహకరించింది. డైరెక్టర్ గా,రచయితగా సాయి రాజేష్ సక్సెస్ అయ్యాడు.డైలాగ్స్ అద్భుతంగా వున్నాయి.విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సూపర్ గా వుంది.ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది.నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ ఎమోషనల్ లవ్ డ్రామా గా వచ్చిన ఈసినిమా మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.హీరో హీరోయిన్ నటన, డైలాగ్స్,సంగీతం,డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూడాలనుకుంటే ఈసినిమాను తప్పకుండా చూడొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.