సర్కారు నౌకరి ప్రమోషనల్ సాంగ్ అప్ డేట్

Akash Goparaju Sarkaru Naukari movie promotional song update

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీత తనయుడు కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుది. ఇక మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనున్నారు. దీనిలోభాగంగానే తాజాాగా ప్రమోషనల్ సాంగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈపాటను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈపాటను సింగర్ సునీత ఆలపించనున్నారు.

కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈమెకు కూడా హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =