పాఠశాలలు దత్తత తీసుకున్న లక్ష్మీ- మై సిస్టర్ గర్వంగా ఉంది

manchu manoj praises on manchu lakshmi for adopted government schools

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు నిజమైన హీరోలు అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్, సినీ సెలబ్రిటీలు చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది చేసే పనులు బయటకు రావచ్చు.. కొంతమంది చేసే పనులు బయటకు రాకపోవచ్చు. కానీ చాలామంది సినీ సెలబ్రిటీలు ఏదో ఒక సేవాకార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మీ కూడా తను చేసిన మంచి పనికి ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచు లక్ష్మీ కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈనేపథ్యంలోనే మంచు లక్ష్మీ టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించిన ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుందామె. ఇప్పుడు తాజాగా గద్వాల జిల్లాలోని మరో 30కు పైగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటిని కూడా స్మార్ట్ స్కూళ్లలాగ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంచులక్ష్మీ చేసిన ఈపనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు మంచు మనోజ్ కూడా తన అక్క చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఇన్ట్సాలో పోస్ట్ చేశాడు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అక్క.. ఈ ప్రయత్నం పిల్లల భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపనుంది… ఈ పనికి సహకరించిన కలెక్టర్ క్రాంతి గారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా మోహన్ బాబు వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మంచు లక్ష్మీ. ముందు బుల్లి తెరపై హోస్ట్ గా మారిన లక్ష్మీ ఆ తరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి తన టాలెంట్ ను చూపించింది. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూనే ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =