7:11PM మూవీ రివ్యూ-థ్రిల్లింగ్ టైమ్ ట్రావెలర్

7:11 PM Telugu Movie review

చైతు మాదాల దర్శకత్వంలో సాహస్, దీపికా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 7.11 PM. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఎన్నో అంచనాలను మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సాహస్, దీపికా, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు
దర్శకత్వం.. చైతు మాదాల
బ్యానర్స్.. ఆర్కస్ ఫిల్మ్స్
నిర్మాతలు.. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి
సంగీతం.. గ్యాని
సినిమాటోగ్రఫి.. శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్.. శ్రీను తోట

కథ..

హంసలదీవి గ్రామానికి చెందిన రవి(సాహస్) చదువు పూర్తిచేసుకొని ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. ఖాళీ సమయంలో తన బాబాయ్ తో కలిసి సైనిక్ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు. మరోవైపు అదే ఊరిలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణ(భరత్ రెడ్డి) చెల్లి విమలా(దీపికా) ప్రేమలో ఉంటాడు. విమలా కూడా రవిని ప్రేమిస్తుంటుంది. అయితే వారి ప్రేమ కృష్ణకు నచ్చదు. ఈనేపథ్యంలో విమలకు వేరే పెళ్లి చేద్దామని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా స్థానిక మంత్రి బసవ పున్నయ్య సాయంతో రాజేష్ అనే వ్యక్తి అపరిమిత మ్యూచువల్ ఫండ్స్ పేరుతో ఊరి ప్రజల దగ్గర డబ్బు తీసుకొని మోసం చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇంకోవైపు న్యూక్లియర్ వ్యర్ధాల డంప్ ఏర్పాటు కోసం ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని కుయుక్తులు పన్నుతుంటాారు. ఈనేపథ్యంలో తన ఊరిని కాపాడుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో టైమ్ మిషన్ ఎక్కుతాడు. అలా ఎక్కిన రవి మరుసటి రోజు ఆస్ట్రేలియాలో ఉంటాడు. తర్వాత ఏం జరిగింది ? రవి మళ్ళీ వెనక్కి వెళ్ళాడా ? తన ఊరికి వచ్చిన సమస్యలను ఎలా అడ్డుకున్నాడు..? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ..

కంటెంట్ ఉండే సినిమాలకు ఈమధ్య ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూస్తున్నాం. దానికి లేటెస్ట్ ఉదాహరణగా వచ్చిన బలగం సినిమా గురించే చెప్పుకోవచ్చు. ఈసినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం దక్కించుకుంది. అలా కంటెంట్ ను నమ్ముకొని తీసిన సినిమా 7.11పీఎమ్. ట్రైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు.

మరి ఏసినిమాను తీసుకున్నా అదే పాయింట్ తో ఎన్నో సినిమాలు వచ్చే ఉంటాయి. కాకపోతే సినిమాను ఎంత కొత్తగా.. ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నాం అనే దానిపై ఆధారపడిఉంటుంది. ఇక ఇప్పుడు టైమ్ ట్రావెల్ పై కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు వచ్చిన ఆదిత్య 369 టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమానే. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ఇలాంటి సినిమాను తీసి అప్పట్లోనే సంచలన విజయం సాధించారు. ఇక ఈమధ్య కాలంలో వచ్చిన సూర్య 24, కళ్యాణ్ రామ్ బింబిసార, శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాలు కూడా ఈనేపథ్యంలో వచ్చి మంచి హిట్లనే సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు 7.11పీఎమ్ సినిమా కూడా కొత్త కాన్సెప్ట్ తో వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఒక గ్రామానికి వచ్చిన సమస్యను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కు ముడిపెట్టి చైతు మాదాల ఈసినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. ఊరంటే అమితమైన ప్రేమ ఉన్న హీరో.. ఆ ఊరికి వచ్చే సమస్యను ఎలా అడ్డుకున్నాడు.. దానికి టైమ్ ట్రావెలింగ్ మిషన్ ఎలా ఉపయోగపడింది.. అనేదే ఈసినిమా కాన్సెప్ట్. ఫస్టాఫ్ అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. రెగ్యులర్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ సాగినా.. సెకండాఫ్ లో మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను చూపించాడు. విలేజ్ లో బస్ ఎక్కిన హీరో ఆస్ట్రేలియాలో ఉండటం.. పాతికేళ్లు ముందుకెళ్లిన హీరో ప్రస్తుత కాలానికి రావడానికి చేసిన ప్రయత్నాలు చాాలా ఆసక్తికరంగా ఉంటాయి.

పెర్ఫామెన్స్

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈసినిమాలో హీరోగా చేసిన సాహస్ కు ఇది మొదటి సినిమానే అయినా చాలా బాగా నటించాడు. చాలా ఈజ్ తోనే నటించుకుంటూ వెళ్లాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన దీపికా కూడా బాగానే నటించింది. పల్లెటూరి అమ్మాయిల డీసెంట్ గా కనిపించింది. సారా పాత్రలో చేసిన నటి కూడా ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన భరత్ రెడ్డి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రైజింగ్ రాజు తన కామెడీతో బాగానే నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇలాంటి సినిమాలకు సాంకేతిక విభాగం చాలా ప్రధానమైనది. ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా ప్రధాన బలంగా నిలిచింది. శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో అందించిన సినిమాటోగ్రఫి మెయిన్ హైలెట్ గా నిలించింది. రెండు వేరు వేరు కాలాలను చాలాా బాగా చూపించారు. ఇక గ్యానీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువలు. చిన్న సినిమానే అయినా కూడా భారీ స్థాయిలోనే నిర్మించారు.

ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. అంతేకాదు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడంలో సందేహం లేదు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =