మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆతరువాత పలు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఇటీవలే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల నవ్వుతూ ఉన్న పోస్టర్ చాలా బాగుంది. వీరిద్దరి కాంబినేషన్ ఈసినిమా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది.
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: