బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లు కొత్త సినిమాలతో సందడిగా మారతాయి. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం, జులై 7, 2023) పలు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి స్టార్ హీరోల సినిమాలు కాకపోయినా.. కొందరు ప్రముఖ నటులు నటించినవి కావడం, అలాగే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో ఆయా చిత్రాల నిర్మాతలు, దర్శకులు చెప్పడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఇవే..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘రంగబలి’ సినిమా
టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య, యుక్తి తరేజ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘రంగబలి’. సత్య, గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, అనంత్ శ్రీరామ్, బ్రహ్మజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా నాగశౌర్య, సత్య కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ అని రంగబలి టీమ్ వెల్లడించింది. ఎస్ఎల్‌వి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా, పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.
‘సర్కిల్’ సినిమా
విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు నీలకంఠ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కిల్’. హీరోగా సాయిరోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా కథానాయికలుగా నటించారు. అలాగే శరత్ చంద్ర, సుమలత, వేణుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మించారు.
‘7:11 PM’ సినిమా
1999లో జరిగే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందడం విశేషం. భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఓ గ్రహాంలో నివసించే వాళ్లకు ఆంధప్రదేశ్‌లోని హంసలదీవికి చెందిన ఓ శాస్త్రవేత్త కుటుంబానికి ఉండే కనెక్షన్ గురించి ఏంటి అనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సాహస్, దీపిక, రఘు కారుమంచి, డాక్టర్ భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నటించారు. చైతూ మాదాల దర్శకత్వంలో నరేన్ యడమడల, మాధురి రావిపాటి,వాని కన్నెగంటిలు నిర్మించిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.
‘భాగ్ సాలే’ సినిమా
ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నేహా సోలంకి, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘భాగ్ సాలే’. వర్షిణి, జాన్ విజయ, రాజీవ్ కనకాల, వైవా హర్ష తదితరులు నటించారు. ఓ డైమండ్ రింగు చుట్టూ తిరిగే కథ ఇదని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకి హీరో శ్రీ సింహ సోదరుడు కాల భైరవ సంగీతం అందించడం మరో విశేషం. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రణీత్ బి దర్శకత్వం వహించగా.. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.
‘రుద్రంగి’ సినిమా
తెలంగాణ ప్రాంతంలోని రుద్రంగి అనే సంస్థానంలో ఉండే దొరల నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. భీమ్ రావు అనే దొర పాత్రలో జగపతిబాబు నటించారు. మమతా మోహన్ దాస్, విమలా రామన్, గనవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించగా.. నూతన దర్శకుడు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన రుద్రంగి చిత్రం నేడు విడుదలయ్యింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: