అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే కొద్ది రోజులుగా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అదే నిజం చేస్తూ ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేయడం లేదని తెలిపాడు సందీప్ వంగా. తాజాగా ఈసినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందో తెలుపుతూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఆ వీడియోలో.. ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేయలేకపోవడానికి మెయిన్ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కవ టైమ్ పడుతుంది.. క్వాలిటీని అందించాలంటే టైమ్ పడుతుందని.. క్వాలిటీ విషయంలో రాజీపడమని.. ఉదాహరణకు ఇందులోని ఏడు పాటలు ఉన్నాయి.. ఐదు భాషల్లో 35 పాటలు అందించాలి..ఇన్ని పాటలను డిఫరెంట్ సెటప్ ప్లేసెస్, డిఫరెంట్ సెటప్ సింగర్స్‌తో రికార్డ్ చేయాలంటే చాలా టైమ్ పడుతోంది. అందుకే లేట్ అవుతుంది.. ఏదో హిందీ వైర్షన్ కు డబ్బింగ్ చెప్పినట్టు కాకుండా ఏ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఆ లాంగ్వెజ్ లో ఒరిజినల్ గా అనిపించాలని అన్నారు. ఇక ఈ పనులన్నీ అయిపోయిన తరువాత డిసెంబర్1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తాం అని కొత్త రిలీజ్ డేట్ పై కూడా ఒక్కసారే క్లారిటీ ఇచ్చారు.
ఇక ప్రీరిలీజ్ టీజర్‌కు ఇచ్చిన రెస్పాన్స్‌కు థాంక్స్. ఈ కంటెంట్ సినిమాలో ఉండదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఇదంతా మూవీలోని ఎపిసోడ్ నుంచి కట్ చేసిందే కాబట్టి తప్పకుండా ఉంటుంది. ప్రేక్షకులకు వీడియో, ఆడియా పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇది చాలా పెద్ద సినిమా.. డిసెంబర్ 1న థియేటర్లకు వచ్చి రణబీర్ కపూర్ విశ్వరూపం చూడండి అని తెలిపాడు.
#1stDecemberANIMALrelease@AnilKapoor #RanbirKapoor @thedeol @iamRashmika@tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala #ShivChanana @neerajkalyan_24 @sureshsrajan pic.twitter.com/EAGLNTaEy9
— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 3, 2023
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: