మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్

miss shetty mr polishetty movie release date fixed

టాలీవుడ్ లో అరుంధతి, భాగమతి, దేవసేన పేర్లకు పెట్టింది పేరు అనుష్క. ఎన్నో ఏళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించిన అనుష్క ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుంటుంది. అనుష్క నుంటి వచ్చిన చివరి సినిమా నిశ్శబ్దం. ఈసినిమా వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. ఒక చెఫ్‌కు, స్టాండప్‌ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకోవడమే కాకుండా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అయితే ఇప్పటివరకూ ప్రకటించలేదు మేకర్స్. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈసినిమా అనుష్క కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 4 =