తమిళ్ హీరోల్లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ ఆంటోని పేరు కూడా ఉంటుంది. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే విజయ్ ఆంటోని ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బిచ్చగాడు తరువాత తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇక రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో అలరించిన విజయ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా హత్య. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా గత ఏడాదే మొదలైంది. ఫస్ట్ లుక్ తో పాటు పలు పోస్టర్లు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మధ్యలో విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమాా రిలీజ్ కు కాస్త బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ తెలియచేసింది.
కాగా ఈసినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: