కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

captain miller movie first look release date fixed

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్నా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దీంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ కు సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 30వ తేదీన ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =