తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. ఈసినిమా షూటింగ్ అయితే చివరి దశకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ఏపీలో జరుపుకుంటుంది. తిరుపతి దగ్గర్లో ఉన్న తలకోన వాటర్ ఫాల్స్ వద్ద ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుందని తెలియడంతో తెలుగు విజయ్ ఫ్యాన్స్, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు విజయ్ ని చూడటానికి భారీగా తరలి వెళ్లారు. దీంతో భారీగా పోలీసులు షూటింగ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు విజయ్ కూడా ఫ్యాన్స్ కు అభివాదం తెలిపి వారిని పలకరించారు. ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thalapathy @actorvijay meets fans at Talakona, Andhra Pradesh where #Leo shooting is happening now 🙌pic.twitter.com/IAn08o5msW
— Vijay Fans Trends (@VijayFansTrends) June 26, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: