టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. ఇక 18 పేజెస్ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు నిఖిల్ నుండి వస్తున్న సినిమా స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో హైప్ ను పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా రిలీజ్ పై గత కొద్ది రోజులుగా అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఎలాంటి అనుమానాలు లేకుండా జూన్ 29వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగా ఈసినిమా పాన్ ఇండియాపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా స్పై ఐదు భాషల కంటెంట్ పంపించేశాం.. ఓవర్సీలో తెలుగు, హిందీ భాషలు కంటెంట్ పంపేసాం.. ఇక్కడ ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇంకా మలయాళంలో ఈసినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది అంటూ స్పష్టం చేశారు.
#Spy 5 Languages Content Sent… 🔥
Overseas Telugu & Hindi Content sent💥
Simultaneous Same Day India Wide Massive Release in Telugu, Hindi, Kannada, Tamil & Malayalam. 🔥💥 #IndiasBestKeptSecret just 2days away🇮🇳
Bookings Open too👉🏻 https://t.co/scpq22n7Vj… pic.twitter.com/rpXrG1EJtw— Nikhil Siddhartha (@actor_Nikhil) June 27, 2023
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























