మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈనిమా టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ ను జూన్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
Get ready for an explosion of excitement and a MEGA CELEBRATION like never before 💥
The electrifying #BholaaShankar Teaser on June 24th🔥
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati @dudlyraj @AKentsOfficial… pic.twitter.com/rEK2ogkBH5
— AK Entertainments (@AKentsOfficial) June 22, 2023
కాగా ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా.ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: