అంజలి మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ప్రారంభం

talented actor anjali 50th movie eegai shoot begins

ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగులో కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ నటిస్తున్న 11వ సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గానే తన పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో రత్నమాల అనే పాత్రలో నటిస్తుంది. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటితో పాటు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లలో కూడా చేస్తూ ప్రేక్షకులకు అలరిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తన సినీ ప్రయాణంలో అప్పుడే అర్థసెంచరీ కొట్టేసింది. తాజాగా అంజలి 50వ సినిమా సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. అశోక్ వేలాయుథం దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమ ఈగై. ఈసినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగాా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేశారు.

కాగా ఈసినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. గ్రీన్ అమ్యూజ్ మెంట్ ప్రొడక్షన్స్ ఇంకా డీ3 ప్రొడక్షన్ కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నాయి. ధరన్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
శ్రీధర్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =