కొంతకాలంగా దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా ఫస్ట్ డే నుండే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టుకుంటుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈసినిమా 400 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా 75.7 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. తాజాగా 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసింది. ఈసినిమా ఆరు రోజుల్లో 410 కోట్లను రాబట్టుకుంది. ఇక ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 118.60 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో భారీ అంచనాలతో రాబోతున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక వీటితో పాటు సందీప్ వంగా తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఇంకా మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: