జపాన్ లో వేరే లెవల్ లో ప్రభాస్ క్రేజ్

japan lady fan travels from tokyo to singapore for adipurush movie

ఏ హీరో అయినా ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా అది తమ అభిమానులకు నచ్చాలని, సినీ ప్రేక్షకులు సినిమా చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంత రిస్క్ అయినా చేయడానికి ముందుకొస్తుంటారు. అందుకే భాషతో, దేశంతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్థాయి కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా కాదు.. ఇంటర్నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించిపెట్టింది. ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతోపాటు నార్త్‌లోనూ..విదేశాల్లోనూ డార్లింగ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ కు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఆ మధ్య ప్రభాస్ ను కలవడానికి ఏకంగా జపాన్ నుండి 10మంది లేడీ ఫ్యాన్స్ తన ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రీసెంట్ గా రిలీజ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఓ లేడీ జపాన్ అభిమాని ఈసినిమా చూడటం కోసం టోక్యో నుండి సింగపూర్ వరకూ వెళ్లింది. దీంతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ మరోసారి అర్థమవుతుంది అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా.. హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇంకా ఈసినిమాకు సినిమాటోగ్రఫి కార్తిక్ పళని, సంగీతం.. అజయ్ అతుల్, ఎడిటింగ్.. అపూర్వ మోతివాలే అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =