జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ముమ్మడివరంలో జరిగిన వారాహి విజయయాత్రలో సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ నేపథ్యంలో సాగుతున్న సభలో సందర్భానుసారం మిగితా తెలుగు సినిమా స్టార్ హీరోల గురించి ప్రస్తావించారు.మహేష్ బాబు గారు,ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు నేను వేరే రాష్ట్రాల్లో,దేశాల్లో తెలియకపోవచ్చు కానీ వారు తెలుసు.నాకన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటారు.చిరంజీవిగారు,బాలకృష్ణ గారు,జూనియర్ ఎన్టీఆర్ గారు,రామ్ చరణ్ గారు,అల్లు అర్జున్ గారు వీరంత నాకు ఇష్టం.ఎన్టీఆర్,చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు.ఇవి చెప్పడానికి నాకు ఎలాంటి ఇగో లేదని పవన్ అన్నారు.అంతేకాదు రాజకీయం,సినిమా ఒక్కటి కాదని వీరి ఫ్యాన్స్ ఈసారి జనసేన వైపు చూడాలని ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.ఇలా పవన్ వేరే హీరోల గురించి పొగడడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పొలిటికల్ గా బిజీ గా వున్నాడు పవన్. ప్రస్తుతం అయన చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి.అందులో ఒకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి.ఈసినిమా సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.దీంతో పాటు క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు,హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు.అలాగే సముద్రఖని తెరకెక్కిస్తున్న బ్రోలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇందులో సాయిధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు.వచ్చే నెల 28న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: