జవాన్- విజయ్ సేతుపతి నా ఫేవరెట్ యాక్టర్

shah rukh khan opens up about his jawan co star vijay sethupathi

పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్ షా అని నిరూపించుకున్నాడు షారుఖ్ ఖాన్. ఈసినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను సైతం అందించింది. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమా వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. క్రేజీ ఈకాంబినేషన్ వస్తున్న సినిమా అవ్వడం వల్ల మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా షారుఖ్ తన ట్విట్టర్ ద్వాారా నెటిజన్స్ తో ముచ్చటించారు. ఇక ఈసందర్భంగా జవాన్ లో విలన్ విజయ్ సేతుపతి గురించి చెప్పమని అడుగగా దానికి షారుఖ్ విజయ్ సేతుపతి తన ఫేవరెట్ నటుల్లో ఒకరని… ఇంకా జవాన్ లో తను చాలా కూల్ గా యాక్ట్ చేశారని తెలిపాడు.

కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.