రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ సమయంలో విక్రమ్ గాయపడటంతో షూట్ కు బ్రేక్ పడింది. చాలా రోజులు గ్యాప్ అనంతరం.. ప్రస్తుతం విక్రమ్ కూడా కోలుకోవడంతో మళ్లీ షూట్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం జూన్ 15 లేదా 17 వ తేదీల్లో షూటింగ్ ను స్టార్ట్ చేయనునున్నట్టు సమాచారం. రెండు వారాలపాటు జరిగే ఈ షూట్ లో విక్రమ్ తో పాటు లీడ్ యాక్టర్స్ పాల్గొననున్నట్టు తెలుస్తుది. అంతేకాదు ఈ షెడ్యూల్ తో షూట్ మొత్తం పూర్తవుతుందట. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే మొదలుపెట్టనున్నారట.
కాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలను ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: