ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న సినిమా పేరు ఆది పురుష్. దేశవ్యాప్తంగా ఈసినిమానే హాట్ టాపిక్ గా మారింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో ప్రాంతీయ బేధాలకు అతీతంగా ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్టే చిత్రయూనిట్ కూడా సినిమాపై రోజు రోజుకూ అంతే బజ్ ను క్రియేట్ చేస్తుంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ను అందించారు. అంతేకాదు సెన్సార్ బృందం నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మరోసారి రామయాణాన్ని విజువల్ వండర్ గా చూపించిన విధానంపై ప్రశంసలు కురిపించినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: