ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత

rrr actor ray stevenson passes away

గత రెండు రోజులుగా టాలీవుడ్ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ (రాజ్-కోటి ద్వయంలో రాజ్) రెండు రోజుల క్రితం మరణించారు. నిన్న ప్రముఖ నటుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శరత్ బాబు కన్నుమూశారు. అనారోగ్యంతో నెల రోజుల నుండి హాస్పితల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న కన్ను మూశారు. నేడు మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో నటుడి మృతి చెందిన వార్త షాకింగ్ కు గురిచేస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ సన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో రే స్టీవెన్ సన్ స్కాట్ అనే బ్రిటిష్ అధికారిగా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. నేడు ఆయన మృతి చెందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రే స్టీవెన్ సన్ మృతితో ధిగ్భ్రాంతికి గురైన చిత్రయూనిటే తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియచేసింది. ఇక రాజమౌళి కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. షాకింగ్ గా ఉంది.. నమ్మలేకపోతున్నా.. రే సెట్స్ కు వచ్చేప్పుడు ఎంతో ఎనర్జీ తో వచ్చేవారు.. తనతో వర్క్ చేయడం చాలా జాయ్ గా ఉండేది.. తన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నా అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

తారక్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రే స్టీవెన్ సన్ మరణ వార్త షాక్ కు గురిచేసింది.. తనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. ఇలాంటి సమయంలో తన కుటుంబసభ్యులకు సంతాపం తెలియచేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =