ఎన్టీఆర్ దేవరలో దసరా విలన్?

dasara movie villain Shine Tom Chacko in jr ntr devara movie

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరెండింటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో దసరా సినిమాలో తన విలనిజంతో మెప్పించిన టామ్ చాకో ఈసినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈసినిమాలో ఒక కీలక రోల్ లో టామ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆయన రెండు రోజుల క్రితమే షూటింగ్ లో పాల్గొన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.