బిచ్చగాడు 3 పై విజయ్ ఆంటోని క్లారిటీ

vijay antony clarity on bichagadu 3 movie

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం కామన్ అయిపోయింది ఇప్పుడు. దీనిలో భాగంగానే రీసెంట్ గా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అయిన బిచ్చగాడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ కూడా చేసేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు బిచ్చగాడు 3 ను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు3 కూడా ఉంటుందని కన్ఫామ్ చేశాడు. బిచ్చగాడు-2 కు కొనసాగింపుగా మూడో భాగం కూడా వస్తుంది.. అయితే అది పూర్తిగా విభిన్నమైన కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి కనీసం ఏడాదికిపైనే సమయం పట్టవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను మొదలు పెడతా. బిచ్చగాడు3ని కూడా నేనే డైరెక్ట్ చేస్తా అని స్పష్టం చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 13 =