వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద సక్సెస్ ను అందించింది మేకర్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా పదిరెట్లు లాభాలు అందించింది. అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఓటీటీ లో కూడా ఈసినిమా తన సత్తా చాటుకుంది. ఓటీటీ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఈసినిమా ఏదో ఒకరకంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు బుల్లితెరపై కూడా బలగం సినిమా తన హవాను కొనసాగిస్తుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా టివిలో బలగం మూవీ ప్రదర్శితమైనంది. ఈనేపథ్యంలో ఈ మూవీ ఏకంగా 14.3 టీఆర్పీ అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈసినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి తన ట్విట్టర్ ద్వారా ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఈసినిమా మొత్తంగా 14.3 టీఆర్పీ దక్కించుకుందని..హైదరాబాద్ లో ఈ మూవీకి 22 టీఆర్పీ లభించిందని.. తమ సినిమాని ఇంతగా ఆదరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
14.3🔥
22 in #HyderabadDear Audience, Your love for the #Balagam has resonated deeply with us, love you all 🙏 @VenuYeldandi9 @HR_3555 #HanshithaReddy #DilRaju🐐@Kilaruness @KavyaKalyanram @dopvenu @LyricsShyam #Bheems #Sampath #Madhu @vamsikaka
#TouchingHearts… pic.twitter.com/Uu0T2DAzSW
— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) May 18, 2023
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: