బలగంకు షాకింగ్ టీఆర్పి 

balagam movie gets excellent trp ratings

ఈఏడాది మార్చి లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది బలగం.చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ లో ఒకటిగా రికార్డు సృష్టించింది.కేవలం 2కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా ఫుల్ రన్ లో 25కోట్ల గ్రాస్ ను రాబట్టింది.కేవలం బలగం థియేటర్లలోనే కాదు టీవీలో కూడా సూపర్ హిట్ అయ్యింది.రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో మొదటిసారి ప్రసారం అయిన బలగం ఏకంగా 14.3రేటింగ్స్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.ఒక చిన్న సినిమా ఈరేంజ్ లో రేటింగ్స్ రాబట్టడం చిన్న విషయం కాదు.ప్రస్తుతం ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది.తెలంగాణ సంప్రదాయాల నేపథ్యంలో కమెడియన్ వేణు ఎల్దండి ఈసినిమాను తెరకెక్కించాడు.ప్రియదర్శి,కావ్య కళ్యాణ్ రామ్ ,రచ్చ రవి,వేణు,సుధాకర్ రెడ్డి,మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. ఇక డైరెక్టర్ గా వేణు మొదటిసినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో తన రెండో సినిమాకు ఓ స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nineteen =