తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సంజయ్ దత్ ఒక కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా సంజయ్ రోల్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విజయ్ కి తండ్రిగా కనిపించనున్నాడట. అంతేకాదు ఇందులో తన పాత్రను 1940 ల సమయంలో గ్యాంగ్ స్టర్ గా చూపించనున్నారని కూడా తెలుస్తుంది. సంజయ్ కోసం సాలిడ్ క్యారెక్టరైజేషన్ ని ప్లాన్ చేశాడట లోకేష్.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: