PKSDT టైటిల్,మోషన్ పోస్టర్ రిలీజ్ 

PKSDT title and motion poster released

తమిళ నటుడు,దర్శకుడు సముద్రఖని డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమా టైటిల్ అలాగే మోషన్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదలచేశారు.ఈసినిమాకు బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ ను రివీల్ చేశారు.అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవన్ అదిరిపోగా మోషన్ పోస్టర్ కు థమన్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కేతికా శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,రోహిణి, బ్రహ్మజీ,తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పవన్ పార్ట్ కు సంబందించిన చిత్రీకరణ ఎప్పుడో పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలన్స్ షూటింగ్ ను పూర్తి చేసేపనిలో వున్నారు.పవన్ ఈసినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈజూలై 28న ఈసినిమా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కోలీవుడ్ లో 2021లో వచ్చిన వినోదయ సీతం సూపర్ హిట్ అనిపించుకుంది.తంబీ రామయ్య,సముద్ర ఖని లీడ్ రోల్స్ లో నటించగా సముద్రఖనే డైరెక్ట్ చేశాడు.సత్య సంగీతం అందించాడు.ఈసినిమా రన్ టైం కేవలం 99నిమిషాలు మాత్రమే అయితే రీమేక్ కు మాత్రం రన్ టైం కాస్త ఎక్కువగానే ఉండనుంది.మరి వినోదయ సీతం కు రీమేక్ గా వస్తున్న బ్రో ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 2 =