బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అతి చిన్న వయసులో తన నటనతో ఆకట్టుకున్నాడు తరుణ్. అనంతరం నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలనం విజయం అందుకున్నాడు. ఇక ఆతరువాత వరుసగా పలు హిట్లను అందుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అనంతరం వరుసగా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్నాడు. దానికితోడు ప్రస్తుతం కాంపిటీషన్ కూడా ఎక్కువవడం..కొత్త కొత్త హీరోలు పరిచయం అవుతుండటంతో తరుణ్ సినిమాలకు దూరమయ్యాడు. సినిమాలకు దూరమై బిజినెస్ ను కూడా కొంత నడిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక త్వరలో తరుణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి చెప్పడం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి తరుణ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తరుణ్ రీఎంట్రీకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. అందులో ఒకటి సినిమా అయితే .. మరొకటి వెబ్ సిరీస్.. ఏది ముందుగా పూర్తవుతుందనేది చూడాలి. తనని ఇంతకుముందు ఆదరించినట్టే ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఆదరించాలనీ.. త్వరలోనే తన పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను అని స్పష్టం చేశారు. మరి చూద్దాం రీఎంట్రీ తర్వాత తరుణ్ కెరీర్ ఎలా కొనసాగుతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: