ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో కొరటాల శివ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సాలిడ్ కథను తయారు చేశాడట. ఫైనల్ గా అయితే ఇటీవలే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బర్త్ డే మే 20 వ తేదీ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ 30 సినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను మే 19 తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటినుండే ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు.
‘The sea is full of his stories 🌊…written in blood 🩸’#NTR30 first look on May 19th on the eve of @tarak9999‘s birthday ❤️🔥❤️🔥#KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/reqZOlcgxU
— NTR Arts (@NTRArtsOfficial) May 17, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: