ప్రభాస్ ఓం రౌత్ క్యూట్ ఫొటో మూమెంట్

adipurush director om raut shares beautiful photo with prabhas

ప్రస్తుతం ఉన్న మోస్ట అవైటెడ్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈసినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ వల్ల ఓంరౌత్ మరింత జాగ్రత్త తీసుకున్నాడు. ముఖ్యంగా టీజర్ లో గ్రాఫిక్స్ వల్ల వచ్చిన విమర్శలతో ఈసారి అలాంటి విమర్శలు రాకుండా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై మరింత దృష్టిని సారించారు. దాని ఫలితం ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు విజువల్స్ పై కూడా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అయితే ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా ఈసినిమా 3డీ ట్రైలర్ రిలీజ్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ తో కలిసి దిగిన పిక్ ను దర్శకుడు ఓంరౌత్ తన ట్విట్టర్ ద్వార షేర్ చేశాడు. యే దోస్తీ అంటూ 3డి లో ఆదిపురుష్ ట్రైలర్ ని నా ఫ్రెండ్ తో చూస్తున్నా అంటూ తెలిపాడు. ఇక ఈ పిక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16వ తేదీన ఈసినిమా 3డీ 4డీ వెర్షన్ లలో పలు భాషలలో విడుదల కాబోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =