కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్, టీజర్ అప్ డేట్

dhanush captain miller movie first look and teaser update

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” . 1930-40ల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఇప్పటికే స్టన్నింగ్ మేకింగ్ విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు సంబంధించిన అప్ డేట్లను ఇచ్చారు. ఈసినిమా ఫస్ట్ లుక్ జూన్ లో, టీజర్ ను జూలై లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చేతిలో పెద్ద గన్ పట్టుకొని యుద్ధభూమిలో నడుస్తూ వెళ్ళడం టెర్రిఫిక్ గా వుంది.

కాగా ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =