ఓటీటీ లోకి వచ్చేసిన శాకుంతలం

samantha starrer shaakuntalam movie streaming on-amazon prime

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా అయిపోతున్నాా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల్లో మాత్రమే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంది. మేకర్స్ కూడా సమంత క్రేజ్ దృష్ట్యా తనపై భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సమంత నటన, కథ, విజువల్స్ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నిజానికి ఈసినిమాను మే 12వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేస్తామని తెలిపింది చిత్రయూనిట్ అయితే ఒకరోజు ముందుగానే ఈసినిమాను రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు ఈసినిమా హక్కులు సొంతం చేసుకున్న నేపథ్యంలో నేటి నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయళం ఇంకా హిందీ భాషల్లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో ఈసినిమాను చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజయ్ చేయండి.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు దుర్వాస మహర్షి , అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో నటించారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మించగా..ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =