ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా జపాన్ లో కూడా చరిత్ర సృష్టిస్తుంది. గత ఏడాది అక్టోబర్ లో ఈసినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా ఇంకా చాలా విషయాల్లో ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా అక్కడ చరిత్ర సృష్టిస్తుంది. ఈసినిమా అక్కడ రిలీజ్ అయి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. 102 స్కీన్స్ లో ఈసినిమా 200 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో పాటు లక్ష 48 వేలకి పైగా ఫుట్ ఫాల్స్ ని కూడా నమోదు చేసుకున్నట్టు తెలియచేశారు. మరి ఇది అరుదైన రికార్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక తెలుగు సినిమాకు ఈరేంజ్ లో ఆదరణ లభించడం అంటే మాములు విషయం కాదు.
200th day running in 102 screens today…
1,248,264 admissions so far…
Andddd… 193214826710 loves & hugs to you Japanese audience ❤️🤩🙏🏻 #RRRinJapan #RRRMovie pic.twitter.com/7yNrPQBo2F
— RRR Movie (@RRRMovie) May 8, 2023
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: