ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో VD12

vijay deverakonda interesting poster released from VD12 movie

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అప్పటినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో తన సినిమాల నుండి వరుసగా అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఖుషి సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా.. ఆ తరువాత తన 13వ సినిమా కు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. పరుశురామ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. బర్త్ డే విషెస్ తెలియచేస్తూ షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.

ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసందర్భంగా సినిమా కాన్సెప్ట్ ను కూడా రివీల్ చేశారు. ఈసినిమా ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా ఉంటుంది అని అర్ధం అవుతుంది. పోస్ట్ లో ప్రతి గూఢచారి కథ కూడా ఓ కుట్రతో ముగుస్తుంది. కానీ దాని వెనుక ఉన్న నిజం మాత్రం మార్చలేనిది అంటూ తెలిపారు. మరి ప్రస్తుతం ఒక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కు ఏడాది అయినా మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eighteen =