నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ ను బట్టి చైతన్య డ్యూటీలో ఉండగా… ఓ రౌడీషీటర్ తప్పుకోవడం.. రౌడీని చైతు ఎలా పట్టుకున్నాడు.. ఆక్రమంలో తన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ట్రైలర్ లో కనిపించింది. ఒకసారి న్యాయం వైపు నిలబడి చూడు నీ లైఫ్ మారిపోతుంది’ .. ‘నిజం గెలవడానికి లేటవుతుంది .. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ వంటి హీరో డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాాల్సిందే.
Truth will always Triumph!! Let’s Begin the HUNT❤️🔥
Here’s the Most Awaited #CustodyTrailer 🔥
Tel: https://t.co/yuzyTu4gH6
Tam: https://t.co/EFYPBI0SKq#Custody #CustodyOnMay12@chay_akkineni @vp_offl @realsarathkumar @thearvindswami @ilaiyaraaja @thisisysr @IamKrithiShetty pic.twitter.com/u3BlN2ympG— Srinivasaa Silver Screen (@SS_Screens) May 5, 2023
కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: