పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ

ponniyin selvan 2 movie review

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మణిరత్నంకు సూపర్ హిట్ ను అందించింది. చోళులు కాలం నాటి కథను తీసుకొని దానిని విజువల్ వండర్ గా చూపించాడు మణిరత్నం. ఇక ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. హిట్ అయిందా? లేదా? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు
డైరెక్టర్.. మణిరత్నం
బ్యానర్స్..లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్
సంగీతం..ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్

కథ..

మొదటి పార్ట్ కు ఈ పార్ట కంటిన్యూషన్ అన్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 లో చోళ యువరాజు అరుణ్ మొళి, పొన్నియన్ సెల్వన్ (జయం రవి), వల్లవరాయన్ (కార్తి) శత్రువులతో పోరాడుతూ ఓ సముద్రంలో మునిగిపోవడం చూపిస్తారు. అయితే అక్కడ పొన్నియన్ సెల్వన్ ని ఓ మహిళ కాపాడుతుంది. అక్కడి నుండే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. అయితే పొన్నియన్ సెల్వన్ చనిపోయాడనే అనుకుంటారు. దీనివల్ల రాజ్యంలో చాలా గందరగోళం నెలకొంటుంది. మరోవైపు దీనికి కారణం నందని నే అని.. తమ చోళ రాజ్యాన్ని నాశనం చేయడానికి చూస్తుందని ఆదిత్య కరికాలన్ (విక్రమ్) అనుకుంటాడు. మరి చోళ రాజ్య సింహాసనం కోసం నందిని (ఐశ్వర్య రాయ్ బచ్చన్) ఎలాంటి రాజకీయాలు చేస్తుంది? చోళ రాజ వంశానికి చెందిన సుందర చోళన్ (ప్రకాష్ రాజ్) పోన్నియిన్ సెల్వన్, ఆదిత్య కరికాలన్ లని చంపడానికి ప్లాన్ వేసింది ఎవరు? పొన్నియిన్ సెల్వన్ ను కాపాడిన ఆ మహిళ ఎవరు? కరికాలన్, నందిల ల ప్రేమ, పగ ఏంటి? అనేది తెలియాలంటే ఈ పార్ట్ చూడాలి.

రాజ్యాలు అంటే కంటికిి కనిపించే ఘటనలు ఉంటే కనిపించనవి ఎన్నో ఉంటాయి. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వారు ఎంతోమంది ఉంటారు. రాజ్యాధికారాలు, అధికార మోహం, కుత్రలు, కుతంత్రాలు, ప్రేమ సంఘర్షణ, అయిన వాళ్లతోనే పోరాటం వంటి ఎన్నో కోణాల సమ్మేళనంతో ఈసినిమా నడుస్తుంది. నందిని, ఆదిత్య కరికాలన్ మధ్య సంఘర్షణే ఈపార్ట్ ప్రధానాంశం.

ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈసినిమాలోని సెకండ్ పార్ట్ కూడా సూపర్ టాక్ ను తెచ్చుకుంటుంది. అంతేకాదు మణిరత్నం కల నిజమైందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తన మనసులో వచ్చిన ఆలోచనను కథగా మలిచి దానిని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా మలిచాడు. మొదటిపార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్ల పరిచయం చేయడానికే ఎక్కువ టైమ్ తీసుకుంది. ఇక ఈ పార్ట్ లో మాత్రం అసలు కథ చూపించాడు మణిరత్నం. కథ తో పాటు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 ను మరింత ఆసక్తికరంగా మలిచి సక్సెస్ అయ్యాడు. ఎక్కడా లాగ్ లేకుండా కథను ఆసక్తికరంగా నడిపించారు.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. ఈసినిమాలో నటించిన నటీనటుల పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనలో వారు కొత్తగా చూపించాల్సింది కూడా ఏం లేదు. స్టార్ కాస్ట్ కాబట్టి ఎవరి పాత్రలో వారు మమేకమైన చేసుకుంటూ వెళ్లిపోయారు. అందరూ తమ బెస్ట్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ చూపించారు. ఐశ్వర్యరాయ్, విక్రమ్ నటించిన సన్నివేశలు హైలైట్ గా కనిపించాయి.ఐశ్వరరాయ్ నందిని, మందాకిని అనే రెండు పాత్రలలో అద్భుతంగా నటించింది. కార్తీకి ఈ పార్ట్ లో కూడా చాలా స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇక ప్రకాష్ రాజ్ కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని బాగున్నాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల మేర బాాగా నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇలాంటి కథలను చెప్పాలనుకున్నప్పుడు డైరెక్టర్ కథ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందుకు తగ్గట్టుగా 24 క్రాఫ్ట్స్ లో కూడా అంతే పర్ఫెక్షన్ ఉండాలి. ఈసినిమాకు కూడా సాంకేతిక విభాగం ప్రధాన బలంగా నిలిచింది. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్స్ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్స్. రవి వర్మన్ సినిమాటోగ్రఫి వల్ల మనం కూడా 9వ శతాబ్దంలో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. అలానే యుద్ద సన్నివేశాలు కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 మరింత గ్రిప్పింగ్ గా ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here