స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి అనుష్క, నవీన్ పోలీశెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్ల తో పాటు పలు స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. రేపు అంటే ఏప్రిల్ 29వ తేదీన ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s time to “stand up” and take notice 😉
The much-awaited teaser of #MissShettyMrPolishetty will be out tomorrow ❤
Stay tuned… 🤩#MSMPTeaser @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @JSKapoor1234 pic.twitter.com/8GOHzzNLuq
— UV Creations (@UV_Creations) April 28, 2023
కాగా మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. గతంలో ఈ బ్యానర్ లో 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈసినిమా అనుష్క కు హ్యాట్రిక్ అందిస్తుందో లేదో? చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































