సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష విడుదలై వారం రోజులైనా కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం స్లో కాకుండా స్టడీగా కలెక్షన్స్ ను రాబడుతుంది.ఈసినిమా నిన్న కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా నిన్న3.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వారం రోజుల్లో 62.5కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్ లో ఆల్రెడీ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 7రోజుల్లో 25కోట్ల షేర్ ను రాబట్టింది.ఐపీఎల్ ప్రభావం తట్టుకొని సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. అయితే ఈరోజునుండి ఈసినిమాకు పోటీఎదురుకానుంది.అఖిల్ నటించిన ఏజెంట్,మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదలవ్వడం తో విరూపాక్ష ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Virupaksha collects 62.5CR at the end of 1st Week & makes a grand entry into the 2nd Week with flying colours 🤩💥
Experience the Visual Spectacle #BlockbusterVirupaksha 👇https://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej@iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/LpK5BU9Ig1
— SVCC (@SVCCofficial) April 28, 2023
ఇక తెలుగులో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈసినిమాను హిందీ,తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలచేయనున్నారు. ఈమూడు భాషల్లో మే మొదటి వారంలో విరూపాక్ష రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది. దీని గురించి త్వరలోనే ప్రకటన రానుంది.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా నటించగా సునీల్,అజయ్,సాయి చంద్ కీలకపాత్రలు పోషించారు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాను ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
ఇక విరూపాక్ష ఫుల్ రన్ లో సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ ను బీట్ చేయనుంది. ఈసినిమాతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకోనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: