మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక తాజాగా చిరు తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. ఇక తాజాగా మెగాస్టార్ తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. గతకొద్దికాలంగా మొగిలయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ వేణు ను సంప్రదించి తన ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చును తానే పెట్టుకుంటానని భరోసా ఇచ్చారట. ఇప్పుడు ఈవార్త వైరల్ అవుతుంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు చేసిన సాయం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత మంది గుర్తింపు తెచ్చుకుంటుందో చూస్తున్నాం. తెలంగాణ సంస్కృతిని చూపిస్తూ మానవ సంబంధాల విలువను ఈసినిమాలో చూపించారు. దాంతో అన్ని వర్గాల వారికి ఆకట్టుకోవడంతో సక్సెస్ గా నిలిచింది. ఇక ఈసినిమాలో నటించిన నటీనటులకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అలానే ఈసినిమాలో క్లైమాక్స్ తోడుగా మా తోడుండి అంటూ వచ్చే పాటను పాడిన మొగలియ్యకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక చిరు గత ఎడాది గాడ్ ఫాదర్, ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు తన తరువాత సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: