కేరళలో కంగువ కొత్త షెడ్యూల్

kanguva movie kerala schedule begin

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరిపారు. అయితే రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. కంగువ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజా సమాచారం ఈసినిమా కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో సూర్యతో పాటు దిశాపటానీ ఇంకా తదితరులు పాల్గొననున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సూర్య పలు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =