బాహుబలి 1&2తో టాలీవుడ్ రేంజ్ మారిపోయింది.ఈసినిమాలు హిందీలోకూడా రికార్డులు క్రియేట్ చేయడంతో బాలీవుడ్ స్టార్ యాక్టర్ల చూపు టాలీవుడ్ ఫై పడింది.ఈమధ్యకాలంలో తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్, అలియా భట్ ఇటీవల గాడ్ ఫాథర్ లో సల్మాన్ ఖాన్ నటించారు.ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.అది కూడా విలన్ పాత్రలతో..ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సైఫ్,రెండింటిలో విలన్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో మొదటిది రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్. ఈసినిమాలో సైఫ్,రావణాసురుడిగా కనిపించనున్నాడు.ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఈజూన్ 16న పాన్ ఇండియా మూవీ గా విడుదలవుతుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈచిత్రంలో రాముడి గా ప్రభాస్,సీతగా కృతి సనన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సైఫ్ తాజాగా తెలుగులో మరో సినిమాకు సైన్ చేశాడు.ఇది కూడా మచ్ అవైటెడ్ మూవీ నే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30(వర్కింగ్ టైటిల్)లో విలన్ రోల్ లో కనిపించనున్నాడు సైఫ్.ఈరోజే ఈసినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా తెలుగుతోపాటు,హిందీ,కన్నడ,తమిళ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.
మరి మీరు సైఫ్ ను ఏ సినిమాలో చూడడానికి ఇష్టపడతారో వోట్ ద్వారా తెలపండి?👇
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: