సాయి థరమ్ తేజ్ నుండి చాలా రోజుల వస్తున్న సినిమా విరూపాక్ష. రిపబ్లిక్ సినిమా తరువాత ఈసినిమాను లైన్ లో పెట్టినప్పటికీ సాయి థరమ్ తేజ్ అప్పుడు ప్రమాదానికి గురవ్వడంతో సినిమా రావడానికి కూడా లేట్ అయింది. ఇక గత ఏడాదే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఫైనల్ ఏప్రిల్ 21 వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుస మరణాలు.. దానికి గల కారణాన్ని హీరో ఎలా చేధించాడు అనే థ్రిల్లింగ్ అంశాలతో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సాయి ధరమ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమా తమిళ్ రైట్స్ ను ఓ టాప్ బ్యానర్ సొంతం చేసుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు ఈసినిమా తమిళ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. తమిళ్ నాడు మొత్తం ఈ సంస్థనే రిలీజ్ చేయబోతుంది.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: