ఏజెంట్ నుండి మరో పవర్ ఫుల్ రోల్ రివీల్

new role revealed from akhils agent

ఈనెలలో వస్తున్న సినిమాల్లో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏజెంట్ కూడా ఒకటి. అఖిల్ నుండి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భాారీ అంచనాలే ఉన్నాయి. గత రెండు మూడు సినిమాలలో లవర్ బాయ్ గా కనిపించాడు అఖిల్. కానీ ఈసినిమాలో ఫుల్ యాక్షన్ ను చూపించడానికి రెడీ అయిపోయాడు. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో బాలీవుడ్ నటుడు డినో మోరియా ఒక పాత్రలో నటిస్తుండగా తన రోల్ ను రివీల్ చేశారు. ది గాడ్ అనే పాత్రలో నటిస్తున్నాడు డినో. ఇక పవర్ ఫుల్ గా ఉన్న ఈపోస్టర్ మరింత ఆకట్టుకుంటుంది. చేతిలో గన్ను పట్టుకొని.. పొడవాటి గడ్డంతో విలన్ లుక్ లో పవర్ ఫుల్ గా ఉన్నాడు.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + thirteen =