హిట్ సిరీస్ తో విజయాలు అందుకున్న శైలేష్ కొలను తన తరువాత సినిమాను అగ్రహీరో వెంకటేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సైంధవ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమాాా ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది కూడా. సెకండ్ షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ వెజాగ్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులో ఒక హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటించనున్నట్టు కూడా పలు కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆవిషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో శ్రథ్థ శ్రీనాథ్ నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రద్థ మనోజ్ఞ అనే పాత్రలో నటిస్తుంది. మరి మరో హీరోయిన్ గా రుహానీ శర్మ ను ఎంపిక చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై కూడా క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
A super talented actress, who melts everyone with her performances!!💥
Team #SAINDHAV welcomes aboard the stunning actress @ShraddhaSrinath as ‘MANOGNYA’ ❤️🔥
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @vboyanapalli @Music_Santhosh @tkishore555 #Venky75 pic.twitter.com/e2hOzwyC60
— Niharika Entertainment (@NiharikaEnt) April 15, 2023
కాగా ఈ సినిమాలో వెంకీని శైలేష్ కొలను మునుపెన్నడూ లేని పాత్రలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 22 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: