మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతంఅందిస్తున్నారు. భోళా శంకర్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మాసివ్ కోల్‌కతా సెట్‌లో ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవల చిరంజీవి భోళా శంకర్ మూవీ సెట్స్ నుండి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో మెగాస్టార్ మరింత స్మార్ట్ గా కనిపిస్తూ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: