ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బలగం. ఈసినిమాకు మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం.. వేణు యెల్దండి
సమర్పణ.. శిరీష్
నిర్మాతలు.. హర్షిత్ రెడ్డి, హన్షిత
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి.. ఆచార్య వేణు
కథ..
కొమురయ్య (సుధాకర్ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి). పెళ్లికి వచ్చిన కట్నంతో తన అప్పులు తీర్చాలనుకుంటాడు. ఈనేపథ్యంలోనే పెళ్లికి రెడీ అవుతాడు. అయితే నిశ్చితార్థం రోజు సుధాకర్ రెడ్డి చనిపోతాడు. అనంతరం పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇక అదే రోజు తాతయ్య భౌతిక కాయం చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్) ను చూస్తాడు. సంధ్యను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుంటే అప్పు తీరుతుందని ప్లాన్ వేస్తాడు. అయితే… సాయిలు తండ్రి (జయరాం)కి, మావయ్య (మురళీధర్)కు మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి?ఇంతకీ సాయిలు సంధ్యను ఎలా ప్రేమలో పడేశాడు ? అందుకు చనిపోయిన తన తాతయ్యను ఎలా వాడుకున్నాడు ? అసలు సాయిలు సంధ్య తండ్రుల మధ్య జరిగిన గొడవలు ఏమిటి ? అన్నది మిగిలిన కథ..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా ప్రొత్సాహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఇప్పటికే సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చిన్న సినిమాలను టాలెంటెడ్ మేకర్స్ ను ఎంకరేజ్ చేసేందుకు గాను ప్రత్యేకంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించాడు. ఇందులో మొదటిగా వస్తున్న సినిమా బలగం. మరి దిల్ రాజు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. బలగం విషయంలో కూడా అది నిజమైంది. ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో అలరించిన వేణు ఇప్పుడు డైరెక్టర్ మొదటి ప్రయత్నంతోనే మంచి పేరును తెచ్చుకున్నాడు. బలగం అంటే మనం సంపాదించుకునేది కాదు, మన కుటుంబమే మన బలగం అని చాటి చెప్పే ప్రయత్నం ఈ సినిమా. దర్శకుడిగా తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యాడని చెప్పాడు. భావోద్వేగాలు, కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణని, గొడవలను ఆవిష్కరించిన తీరు బాగుంది. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు.
పెర్పామెన్స్
ఇక నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. సాయిలు పాత్రలో ప్రియదర్శి చాలా బాగా చేశాడు. పెళ్ళి కోసం, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటప్పుడు, మరదల్ని లైన్‌లో పెట్టే సన్నివేశాల్లో బాగా చేశాడు. నవ్వులు పూయించాడు. అతని పాత్రలో కామెడీ, ఎమోషన్, బాధ్యత కనిపిస్తుంటాయి. అలాగే సుధాకర్ రెడ్డి కూడా ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. అలాగే హీరోయిన్ గా కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్ తన సహజ నటనతో ఆకట్టుకుంది. రచ్చ రవి కామెడీ అలరిస్తుంది. సినిమాలో ప్రతి పాత్ర అలరిస్తుంది. పర్‌ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. మురళీధర్ గౌడ్, రూప లక్ష్మీ, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ వాల్యూస్
సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫి, సంగీతం ఈసినిమాకు ప్రధాన బలంగా మారాయి. కాసర్ల శ్యామ్ పాటలు బాగున్నాయి. తెలంగాణ పల్లెని గుర్తు చేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఆచార్య వేణు కెమెరా వర్క్ బాగుంది. తెలంగాణని, కల్చర్‌ని, అందులోని ప్రతి మూవ్‌మెంట్‌ని స్పష్టంగా చూపించారు. విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే సహజమైన సినిమాలనుఇష్టపడే వాళ్లకి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: